టిడిపికి పూర్వ వైభవం తెద్దాం

Mar 12,2024 21:59

ఎన్నికల ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు

                        మడకశిర : మడకశిర నియోజకవర్గంలో టిడిపికి పూర్వవైభవం తీసుకువద్దామని మాజీ ఎమ్మెల్యే ఈరన్న, రాష్ట్ర వక్కలిగ కన్వీనర్‌ వి ఎం పాండురంగప్ప కోరారు. ఈ మేరకు వారు మంగళవారం అగళి, ఇరిగేపల్లి నందరజానపల్లి గ్రామాల్లో నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల కాలంలో వైసిపి ప్రభుత్వంతో ప్రజలు విసుగెత్తారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి నాయకుల కుంతత్రాలను తిప్పికొట్టి సమర్థవంతంగా పార్టీ అభ్యర్థి గెలుపునకు పాటు పడాలన్నారు. ఈకార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు ఉగ్రనరసింహాప్ప, మాజీ కన్వీనర్‌ ముకుందప్ప, మాజీ ఎంపీపి రామక్రిష్ణప్ప, మాజీ సర్పంచి రవి కుమార్‌, లింగన్న, మాజీ ఎంపీటిసి మల్లేష్‌, లెజెండ్‌ సుధాకర్‌, మాజీ సింగల్‌ విండో అధ్యక్షులు శ్రీనివాస్‌, మాజీ సింగల్‌ విండో డైరెక్టర్‌ రామన్న, నాయకులు మంజు చరణ్‌, తెలుగు యువత ప్రవీణ, కామరాజు మల్లేశప్ప మంజునాథ్‌, హరీష్‌, శీన తదితరులు పాల్గొన్నారు.

➡️