దమ్మున్న నాయకుడు లేరా..? : మాజీ ఎమ్మెల్యే

Jan 12,2024 21:52

సమావేశంలో మాట్లాడుతున్న బికె. పార్థసారధి   

                   రొద్దం : పెనుగొండ నియోజకవర్గంలో వైసిపికి దమ్మున్న ఎమ్మెల్యే అభ్యర్థి దొరకలేదా అని మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారథి ఎద్దేవా చేశారు. శుక్రవారం మండలంలోని ఆర్‌. మరవ పల్లిలో జయహో బిసి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్థసారధి మాట్లాడుతూ పెనుగొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలలో వైసిపికి సరైన ఎమ్మెల్యే అభ్యర్థి కన్పించలేదని ఎద్దేవా చేశారు. టిడిపిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు స్థానిక నాయకులకు లేకేపోవటంతో వలసపక్షులను తెస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్ని వలస పక్షులు వచ్చిన తాము బెదిరేది లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం లాంటిది అని అన్నారు. జనాభాలో 50 శాతం ఉన్న బిసిలకు రాజకీయ ప్రాధాన్యత, ఆర్ధిక వెసులుబాటు కల్పించిన ఘనత టిడిపికి దక్కుతుందన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మడకశిర నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుండుమల తిప్పేస్వామి, టిడిపి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షులు కుంటిమద్ది రంగయ్య, నాయకులు గంగలకుంట రమణ, పాండురంగప్ప, పోతులయ్య, జనసేన పెనుకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కుమార్‌, శ్రీనివాసమూర్తి, గోవిందప్ప, నరహరి, సిద్దయ్య, లక్ష్మిరెడ్డి, చిన్నప్పయ్య, రొద్దం నరసింహులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️