పేదలకు మెరుగైన వైద్యసేవలు అందాలి : కలెక్టర్‌

హిందూపురం వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు

          పుట్టపర్తి అర్బన్‌ : పేదలకు మెరుగైన ఆధునిక వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివద్ధి కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రోహిల్‌ కుమార్‌, డిసిహెచ్‌ఒ తిప్పేంద్ర నాయక్‌, లక్ష్మీకాంతరెడ్డి, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాలు కల్పించి, వైద్య సిబ్బంది నియామకం చేపట్టిందన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తదితర కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. వైద్యులు వీటిని వినియోగించి ప్రజలను మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించడానికి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు కలెక్టర్‌ తెలిపారు, ఆక్సిజన్‌ లైసెన్సు, ఆసుపత్రి జనరేటర్‌ బ్రేకర్స్‌ పెద్దవి రిపేర్‌ చేయడానికి, ఆసుపత్రి నందు దుప్పట్లు మార్చడానికి, శానిటేషన్‌ వర్క్‌, డి సి హెచ్‌ ఓ, ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ విధాన్‌ పరిషత్‌ అధికారులతో, ఎన్జీవో సహకారంతో, ఆసుపత్రికి అవసరమైన పరికరాలు కొనుగోలు చేయడానికి కమిటీ ఆమోదంతో కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డిఎంహెచ్‌ఒ, సెల్వీ ఆంటోని, హిందూపురం ఆసుపత్రి హెడ్‌నర్స్‌ సౌదా మునిష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️