బడికొస్తున్నాం..!

Jun 21,2024 04:05 #jeevana, #Kavitha

కొత్త ఆశలతో.. అల్లరి చేస్తూ
కొత్త దుస్తులతో.. సందడి చేస్తూ
వస్తున్నాం.. మేమొస్తున్నాం
బుడి బుడి అడుగులతో వడి వడిగా
వస్తున్నాం.. మేమొస్తున్నాం

గురువులు నేర్పే పాఠం కోసం
పలకా బలపం పట్టేటందుకు
వస్తున్నాం.. మేమొస్తున్నాం

అక్షరాలను నేర్చేటందుకు
ఆటలు ఆడి పాటలు పాడేందుకు
వస్తున్నాం.. మేమొస్తున్నాంa
చదువులు బాగా చదువుకుని
ఒప్పిస్తాం.. మేం మెప్పిస్తాం
బుడతలు కాము చిరుతలమని
చెప్పేస్తాం.. మేం చూపిస్తాం

కాన్వెంట్‌ బడులకు పోటీగా
సాధిస్తాం…మేం రాణిస్తాం!

కయ్యూరు బాలసుబ్రమణ్యం,
77802 77240.

➡️