ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Dec 4,2023 21:41

మాట్లాడుతున్న ధర్మవరం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కాచర్ల లక్ష్మి

         ముదిగుబ్బ : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వైసిపి నాయకులు అన్నారు. మండలంలోని జొన్నల కొత్తపల్లి సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన జగన్‌ ఎందుకు కావాలంటే కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ప్రజాభివృద్ధే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్‌ నాయకులు ఇందుకూరు నారాయణరెడ్డి, మండల కన్వీనర్‌ సివి నారాయణరెడ్డి, జెడ్పీటీసీ ి తిరుమల సేవ్‌ నాయక్‌, మల్ల గుండ్ల భాస్కర్‌, వెంకటేశ్వర రెడ్డి, పరంధామ రెడ్డి, సర్పంచులు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం టౌన్‌ : పట్టణంలోని 9వ వార్డ్‌లో వై ఎ పి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కాచర్ల లక్ష్మి, పట్టణ అధ్యక్షులు నీలూరి ప్రకాష్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మాసపల్లి సాయికుమార్‌, కౌన్సిలర్‌ చింతాఎల్లయ్య, నాయకులు చాంద్‌బాషా, చెలిమి పెద్దన్న, కత్తే పెద్దన్న, ఎల్‌ఐసి శ్రీరామ్‌, జెన్నే సూరి, వార్డు ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూపురం : పురపాలక సంఘ పరిధిలోని 10వ వార్డులో ఏపీకి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో వైసిపి జెండాను ఎగురవేసి, వార్డులో అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు అందించిన నిధుల వివరాలతో కూడిన బోర్డులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి దీపిక, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బలరామిరెడ్డి, ఏ బ్లాక్‌ అధ్యక్షులు సాదిక్‌, శివశంకర్‌ రెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ రాచపల్లి మహేంద్రనాథ్‌ రెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్‌ ఫరూక్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️