ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Dec 5,2023 22:17

సంక్షేమ పథకాలు వివరించే బోర్డును ఆవిష్కరిస్తున్న ఛైర్‌పర్సన్‌, తదితరులు

        ధర్మవరం టౌన్‌ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రధాన ధ్యేయమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాచర్ల లక్ష్మీ తెలిపారు. పట్టణంలోని 12వ వార్డులో ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జయరాం రెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మాసపల్లి సాయికుమార్‌, 12వ వార్డు కౌన్సిలర్‌ తొండమాల ఉమాదేవి, వార్డు ఇన్‌ఛార్జులు చాంద్‌బాషా, ఎస్పీ బాషా, తొండమాల రవి, తీర్థాల వెంకటరమణ, తోపుదుర్తి వెంకటరాముడు, కో ఆప్షన్‌ సభ్యులు, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.రొద్దం : జగనన్న ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందనిఎంపీపీ చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని నారనాగేపల్లి సచివాలయ పరిధిలో వై నీడ్స్‌ జగన్‌ ఎపి అనే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి తెలిపే డిజిటల్‌ బోర్డును ఆవిష్కరించారు. అనంతరం వైసిపి జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.నారాయణరెడ్డి, జెట్టి మారుతిరెడ్డి, ఆర్‌ఎ. రవిశేఖర్‌ రెడ్డి, స్థానిక సర్పంచి నాగార్జున, ఎంపిటిసి నాగేంద్రప్ప, లక్ష్మినారాయణరెడ్డి, డీలర్‌ మహేష్‌ రెడ్డి, లక్ష్మి నారాయణప్ప, ఎంపిడిఒ రాబర్ట్‌ విల్సన్‌ తదితరులు పాల్గొన్నారు.పుట్టపర్తి క్రైమ్‌: మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డులో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీ లక్ష్మీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రకు జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గడపగడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ నారాయణరెడ్డి, కడప రాజా తదితరులు పాల్గొన్నారు.లేపాక్షి : మండలం మైదుగోళంలో వైసిపి నాయకులు వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాణాల శ్రీనివాస్‌ రెడ్డి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

➡️