మహిళలు ఆత్మ స్థైర్యంతో ముందుకెళ్లాలి : ఎమ్మెల్యే

Feb 14,2024 22:38

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

                      పుట్టపర్తి అర్బన్‌ : మహిళలు ఆత్మస్థైర్యంతో బ్రతకాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆకాంక్ష అని శాసనసభ్యుడు దిద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలో నాలుగవ విడత డాక్టర్‌ వైయస్సార్‌ ఆసరా క్రింద స్వయం సహాయక సంఘాల మహిళలకు చేయూతనందించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు మహిళల అభివృద్ధికి జగన్‌ చర్యలు తీసుకుంటున్నారన్నారు. అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులకు మెగా చెక్కు ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తుంగ ఓబుళపతి, వైస్‌ చైర్మన్లు శ్రీలక్ష్మీ నారాయణ రెడ్డి, తిప్పన్న, పుడా చైర్‌పర్సన్‌ లక్ష్మీ నరసమ్మ, మూడు మండలాల పార్టీ కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయి లీలా రెడ్డి, అగ్రి బోర్డు చైర్మన్‌ ఆవుటాల రమణారెడ్డి, మహిళా సమైక్య అధ్యక్షురాలు కృష్ణమ్మ, కౌన్సిలర్లు సాయి గీత, సూర్య గౌడ్‌, పలువురు వైసిపి నాయకులు, వెలుగు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

➡️