శంఖారావం సభను విజయవంతం చేయండి

Mar 5,2024 21:48

సమావేశంలో మాట్లాడుతున్న సవితమ్మ

                  మడకశిర : మండలంలోని చీపులేటి గ్రామం సమీపంలో ఈనెల 7న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో చేపట్టబోయే శంఖారావం సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే ఈరన్న, నియోజకవర్గ టిడిపి అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల4న పెనుకొండలో నిర్వహించిన చంద్రబాబు నాయుడు సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 7న నిర్వహించే శంఖారావం సభకు నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పెనుకొండ : టీడీపీ యువనేత నారా లోకేష్‌ బాబు శంఖారావ సభ ను విజయవంతం చేద్దామనితెలుగుదేశం,జనసేన పార్టీ ఉమ్మడి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ కోరారు. ఈ మేరకు ఆమె మంగళవారం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెనుకొండలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేసినందుకు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిదంగా యువనేత లోకేష్‌ ఈనెల 7న పెనుకొండలో నిర్వహించే శంఖారావం సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, నాయకులు పాల్గొన్నారు.

➡️