శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం అవసరం

చంద్రయాన్‌-3 గురించి వివరిస్తున్న విద్యార్థులు

         హిందూపురం ం: విద్యార్థులు శాస్త్ర, సాంకేతికతను పెంపొందించుకుని గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. శనివారం నాడు శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని పాంచజన్య బ్రిలియంట్స్‌ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఫ్యూజన్‌ విజన్‌ ఫెయిర్‌-2024ను మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌రెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు గంగప్ప, ప్రసన్నలక్ష్మి, పాఠశాల వ్యవస్థవక అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాథమిక స్థాయి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు రూపొందించిన సుమారు 600కు పైగా ప్రయోగాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను సజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాలు విద్యార్థులకు దోహదం చేస్తాయన్నారు. ప్రస్తుత వైజ్ఞానిక ప్రదర్శనలో పుస్తక రూపంలో ఉన్న ప్రాజెక్టులే కాకుండా స్వతహాగా సొంత ఆలోచన విధానంతో తయారు చేసే విధంగా విద్యార్థులు ఆసక్తి కలిగించడం అభినందనీయమన్నారు. ఇటీవల చంద్రయాన్‌-3 విజయవంతం కావాడం, దానిని ఎలా ప్రయోగించారు.. పని చేసే విధానం గురించి విద్యార్థులు రూపొందించిన రాకెట్‌ లాంచింగ్‌, విక్రమ్‌ రాడర్‌, అవి పని చేసే విదానంపై విద్యార్థుల వివరణ చాల అద్భుతంగా ఉందన్నారు. ప్రజలు మూఢనమ్మకాలు, మూఢవిశ్వాసాలను పారద్రోలి శాస్త్ర సాంకేతికతను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను తిలకించడానికి వివిధ పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ నందకుమార్‌, ప్రయివేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ నాయకులు వేణుగోపాల్‌, రియాజ్‌, పాఠశాల హెచ్‌ఎం గాయత్రి, ఎఒ భాస్కర్‌, పాఠశాల సుపరిటెండెంట్‌ విజయేంద్ర, ఎహెచ్‌ఎంలు శశికళ, అబ్దుల్‌ రజాక్‌, నతీష్‌ కుమార్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️