సచివాలయ వ్యవస్థతో అర్హులందరికీ సంక్షేమం

Jan 9,2024 21:45

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

                     హిందూపురం : బిసిల పార్టీ అంటు చెప్పుకునే టిడిపి ఏ నాడు బిసిలను గుర్తించలేదని….బిసిలను గుర్తించి వారికి అండగా నిలచిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కిందని మంత్రి పెదిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. మంత్రి రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం రూరల్‌ మండలంలో పూలకుంట, కగ్గల్లు, మణేసముద్రం, మలగూరు, ఎం బీరేపల్లి, చెలివెందుల, బాలంపల్లి పంచాయితీల్లో జరిగిన సమావేశాల్లో పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి శాంతమ్మ, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దీపికతో కలిసి మంత్రి పెడ్డి రెడ్డి రామచంద్రా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా చెలివెందుల గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతు సచివాలయ వ్యవస్థతో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించామన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు, ఆయన బావమర్ది బాలకృష్ణ, బాబు తనయుడు లోకేష్‌ అమలకు సాధ్యం కాని హామీలతో ముందుకు వస్తారని, నమ్మి ఎవరు మోసపోవద్దని కోరారు. నిత్యం అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకుంటే ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్‌ రెడ్డిఈశ్వర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘనీ, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌ రెడ్డి, వైసిపి నాయకురాలు మధుమతి రెడ్డి, జొష్ణరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మేన్‌ బలరామిరెడ్డి, ఎంపిపి రత్నమ్మ, జెడ్పీటీసీ నాగభూషణప్ప, మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ రాచపల్లి మహేందర్‌ నాథ్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ రాము, హనుమంతరెడ్డి, నక్కలపల్లీ శ్రీరామ్‌ రెడ్డి, సర్పంచ్‌ ఉపేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️