సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్దం

Dec 18,2023 21:59

కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇస్తున్న పారిశుధ్య కార్మికులు

                      హిందూపురం : పారిశుధ్యకార్మికులకు ఇచ్చిన హామిలను నెరవేర్చక పోతే ఈ నెల 27 నుంచి సమ్మెకు సిద్దం అవుతామని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి జగదీష్‌ హెచ్చరించారు. ఈ మేరకు మున్సిపల్‌ కార్మికులు సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి, కమిషనర్‌ చాంబర్‌ ముందు ఆందోళన చేసి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌కు సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్బంగా జగదీష్‌ మాట్లాడుతు నాడు పాదయాత్ర, ఎన్నికల సమయంలో పారిశుధ్య కార్మికులకు ఎన్నో హామీలను ఇచ్చారన్నారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 27 నుంచి సమ్మెలోకి వెళతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు ఆనంద్‌, గుర్నాథ్‌ మూర్తి, శంకర, కృష్ణమూర్తి, బాబయ్య, రామంజప్పతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.

➡️