3న పెనుకొండలో ‘జలకవనం’

Feb 23,2024 22:04

జలకవనం పోస్టర్లు విడుదల చేస్తున్న దృశ్యం

                      హిందూపురం : సాహితి స్రవంతి ఆధ్వర్యంలో మార్చి 3న రాయలసీమ జిల్లాలో నీటి సమస్యలపై రాయలసీమ స్థాయిలో జలకవనం కార్యక్రమాన్ని పెనుకొండలో నిర్వహిస్తున్నట్లు సాహితి స్రవంతి జిల్లా కన్వీనర్‌ హరి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రి కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్‌, సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యురాలు డాక్టర్‌ ప్రగతి, కవి, రచయిత సడ్లపల్లి చిదంబరరెడ్డితో కలిసి కవి సమ్మేళన కార్యక్రమానికి సంబందించిన పోస్టర్లు, బ్రోచర్లను విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కష్ట జీవికి అటు ఇటు నిల్చున్న వాడే కవి అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలు అక్షరసత్యమన్నారు.కవులు ప్రజా సమస్యలకు ప్రతిబింబంగా కవిత్వం రాయాలన్నారు. కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని సంకల్పించి సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో కళలకు పుట్టినిల్లుగా ఉన్న పెనుకొండలోని గగన్‌ మహాల్‌ వేదికగా మార్చి 3న జలకవనం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ జలకవనంలో కవిత్వం చదివేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కవులు, కళాకారులు తమ పేర్లను ఇప్పటికే నమోదు చేసుకుంటున్నారన్నారు. అసక్తి గల వారు పేరు, వివరాలను ఏ.హరి కన్వీనర్‌ కన్వీనర్‌ 9491355200, పి.రాజశేఖర్‌ రెడ్డి కో- కన్వీనర్‌ 9441508510 సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు. జలకవనంలో చదివిన కవితలనన్నింటినీ సంకలనంగా తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రసంశా పత్రాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️