పారదర్శకంగా ఎన్నికల వ్యయ పరిశీలన

Apr 19,2024 21:54

అధికారులతో మాట్లాడుతున్న ఎన్నికల వ్యవ పరిశీలకులు  

                        పుట్టపర్తి అర్బన్‌ : ఎన్నికల పరిశీలనను సంబంధిత అధికారులు పారదర్శకంగా చేపట్టాలని పార్లమెంట్‌ ఎన్నికల వ్యయ పరిశీలకులు అమిత్‌ కుమార్‌ ఐఆర్‌ఎస్‌ సూచించారు. లోక్‌ సభ ఎన్నికలను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని విభాగాలను జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబుతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల విధులు తదితర అంశాలపై కలెక్టర్‌ ను అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టరేట్లోని ప్రత్యేక గది నుండి సీసీ కెమెరాలు ద్వారా ఏర్పాటుచేసిన జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టిన నిఘ వివరాలు పరిశీలించి చేపట్టిన చర్యల గురించి కలెక్టర్‌ ను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎన్నికల వ్యయ పరిశీలన విభాగం ఎం సి ఎం సి మీడియా సెంటర్‌ ఫిర్యాదుల పర్యవేక్షణ కంట్రోల్‌ కేంద్రం కాల్‌ సెంటర్‌ పనితీరు గురించి ఆరా తీశారు. రోజువారీగా నిర్దేశించిన నివేదికలు సీఈఓ కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమర్పించాలని ఆదేశించారు. టీవీలు పత్రికలు సోషల్‌ మీడియాలో ప్రసారమయ్యే వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రచార వ్యయాన్ని అభ్యర్థుల ఖర్చు గానే పరిగణించాలన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, సీఈవో విజరు కుమార్‌, ఏవో రామాంజనేయరెడ్డి, నోడల్‌ అధికారి వెంకట చలపతి తదితరులు పాల్గొన్నారు.

➡️