నేడు కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు

Apr 18,2024 21:27

షర్మిల నుంచి బిఫాం అందుకుంటున్న మధుసూదన్‌రెడ్డి

                 పుట్టపర్తి అర్బన్‌ : కాంగ్రెస్‌ పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్‌ రెడ్డి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైయస్‌ షర్మిల నుంచి భీఫాం అందుకున్నారు. గురువారం మడకశిర నియోజకవర్గం లో వైయస్‌ షర్మిల పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆమె చేతుల మీదుగా బీఫారం అందుకున్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీఫార్మ అందించినందుకు వైఎస్‌ షర్మిలకు, తనకు టికెట్‌ వచ్చేనందుకు సహకరించిన సిడబ్ల్యుసి సభ్యుడు డాక్టర్‌ రఘువీరా రెడ్డికి జిల్లా పార్టీ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రెండు సెట్ల నామినేషన్‌ వేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆ తరువాత వామపక్షాల సహకారంతో త్వరలో మరో రెండు సీట్లు వేస్తామన్నారు. ఈ నామినేషన్‌కు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు తరలిరావాలని కోరారు.

➡️