ప్రజల తలరాత మార్చే ఎన్నికలు : పల్లె

పల్లె, బికె పార్థసారధి సమక్షంలో టిడిపిలో చేరిన నాయకులు

        ఓబుళదేవరచెరువు : ప్రజల తలరాత మార్చే ఎన్నికలని, వీటిని ఆషామాషీగా తీసుకోవద్దని మాజీ మంత్రి డాక్టర్‌ పల్లె రఘునాథ్‌రెడ్డి, హిందూపురం టిడిపి ఎంపి అభ్యర్థి పార్థసారధి సూచించారు. ఓడి చెరువులో గురువా రం ఏర్పాటు చేసిన పార్టీ సమన్వయ సమావేశంలో వారు మాట్లాడుతూ టిడిపి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని కోరారు. ముందుగా ముస్లింలకు రంజాన్‌ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వైసిపి పాలనలో సిఎం జగన్‌ అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని, టిడిపి వస్తేనే అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందన్నారు. టిడిపి హయాంలో కియా లాంటి పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. ఎన్నికల్లో సైకిల్‌ గర్తుకు ఓటు వేసి ఎంపిగా పార్థసారధిని, పుట్టపర్తి ఎమ్మెల్యేగా పల్లె సింధూరరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం అమడగూరు మండలంలోని జౌకుల గ్రామానికి చెందిన 4 వైసిపి కుటుంబాలు, ఓడి చెరువుకు చెందిన బాబ్‌జాన్‌ పల్లె, బికె పార్థసారధి సమక్షంలో టిడిపిలో చేరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ జయచంద్ర, పిట్టా ఓబుల్‌రెడ్డి, నాయకులు జయన్న, కృష్ణమూర్తి, డాక్టర్‌ పొగాకు జాకీర్‌, రామాంజనేయులు, పీట్ల సుధాకర్‌, అంజనప్ప, తుమ్మల మహబూబ్‌బాషా, ఆరిఫ్‌ఖాన్‌, నిజాంఖాన్‌, సర్పంచి శంకర్‌రెడ్డి, ఎంపిటిసి శ్రీనివాసులు, నరసింహారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, కొండే ఈశ్వరయ్య, ఓబుల్‌రెడ్డి, కంచి సురేష్‌, గంటా శ్రీనివాసులు, నాగేంద్ర, నాగరాజు, కుమార్‌ రాయల్‌, శ్రీనివాసులు, మీసేవ సుధాకర్‌, అంజనరెడ్డి, గిరినాథ్‌రెడ్డి, మస్తానమ్మ, పాలెమ్మ, ఆశాబి, భాగ్యమ్మ పాల్గొన్నారు.

➡️