ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

Mar 1,2024 11:49 #Sri Satya Sai District
Inter exams started peacefully

ప్రజాశక్తి-హిందూపురం : శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాలలో ప్రశాంతంగా ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమైనాయి. జిల్లా వ్యాప్తంగా 113 జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం ఇంటర్ చదువుతున్న 11.528 మంది విద్యార్థులకు ఆయా పట్టణాలు మండల కేంద్రాలు కలుపుకొని మొత్తం 41 పరీక్ష కేంద్రాలు, ప్రశ్న పత్రాల నిల్వ కోసం 21 పాయింట్లను ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాటు చేశారు. హిందూపురం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు సువర్ణ భారతి జూనియర్, కళాశాల ఎస్ డి జి ఎస్, నారాయణ, బాలయేసు, బాలాజీ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించరాదని ఇంటర్ బోర్డ్ కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఆయా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందే హాజరైనారు. కొంతమంది విద్యార్థులు సకాలంలో వచ్చినప్పటికీ సమయం ఎక్కడ అయిపోయిందో అన్న ఆత్రుతతో పరుగు పరుగున ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను అధికారులు కల్పించారు.

➡️