కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి

May 5,2024 21:36

 ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్‌ అభ్యర్థి

                    పుట్టపర్తి రూరల్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పుట్టపర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా పుట్టపర్తి మండల పరిధిలోని పెడపల్లి, సుబ్బరాయన పల్లి, పెడపల్లితండా, బత్తలపల్లి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️