కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

Apr 30,2024 22:45

కౌంటింగ్‌కేంద్రం వద్ద అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

                          లేపాక్షి : మండలంలోని చోళసముద్ర సమీపంలో డాక్టర్‌ బిఆర్‌. అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాలకు సంబందించిన కౌంటింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ అరుణ్‌బాబు మంగళవారం పరిశీలించారు. హిందూపురం పార్లమెంటుకు సంబంధించిన కౌంటింగ్‌ కేంద్రాలకు సంబంధించిన గదులను పరిశీలించిన ఆయన అక్కడి ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. హిందూపురం : హిందూపురం రూరల్‌ మండలం, లేపాక్షి మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ అరుణ్‌బాబు మంగళవారం పరిశీలించారు. హిందూపురం మండలంలోని గుడ్డంపల్లి సమీపంలో ఉన్న బిట్‌ కళాశాల, లేపాక్షి మండలంలోని చోళ సముద్ర సమీపంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️