ఉపాధి కూలీలకు పనిముట్లు ఇవ్వాలి

Jun 18,2024 22:14

సమస్యను వివరిస్తున్న ఉపాధి కూలీలు

                చిలమత్తూరు : ఉపాధి కూలీలకు పనిముట్టు ఇవ్వాలని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం మండల పరిధిలోని సంజీవరాయినిపల్లి, కొత్తచామలపల్లి, చిన్నన్నపల్లి గ్రామాలలో ఉపాధి కూలీల పని ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజులు పూర్తి చేసిన ఉపాధి కూలీలకు గత నాలుగు సంవత్సరాలుగా పనిముట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే పనిముట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా నాలుగు వారాల నుంచి బిల్లులు అందక కూలీలు నానా ఇబ్బందులు పడుతు పనులు చేస్తున్నారని అన్నారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో పని ప్రదేశానికి వాహనాల సహాయంతో వెలుతున్నా రవాణా ఖర్చులు ఇవ్వకుండా కోత విధిస్తున్నారని అన్నారు. తక్షణమే కూలీలకు రావాల్సిన పనిముట్లు, పెండింగ్‌ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కూలీలు శివకుమార్‌, నాగేంద్ర, ఆదెప్ప, నరసింహ, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు

➡️