‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’

May 6,2024 22:11

తాము ఏర్పాటు చేసిన ఫెక్సీ ఎదుట కుటుంబసభ్యులు

                         అనంతపురం :’మా ఇంట్లో ఓటు అమ్మబడవు.. 25ఏళ్లుగా మా కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే వారికే మా ఓట్లు..’ అంటూ నగరంలోని లెక్చరర్స్‌ కాలనీలో ఉన్న తన ఇంటికి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కోశాధికారి టి.వి.రెడ్డి ఫ్లెక్సీ అతికించారు. ఈపోస్టర్‌ను కాలనీ అధ్యక్షులు, విశ్రాంత ఆర్‌ఐఒ కిష్టప్ప ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఎన్నికల కోసం వస్తున్న అభ్యర్థులను సమస్యలపై ప్రశ్నిస్తే ఏ సమస్య అయినా త్వరితగతిన పరిష్కరించుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో టివి.రెడ్డి కుటుంబ సభ్యులతోపాటు కాలనీ ఉపాధ్యక్షులు పి.సురేష్‌, సహాయ కార్యదర్శి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️