అండగా నిలవాలి

ఎన్‌డిఎ కూటమి బలపర్చిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే, విజయనగరం ఎంపీ అభ్యర్థులు

మాట్లాడుతున్న సురేష్‌

ప్రజాశక్తి- లావేరు

ఎన్‌డిఎ కూటమి బలపర్చిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే, విజయనగరం ఎంపీ అభ్యర్థులు నదుకుదిటి ఈశ్వరరావు, కలిశెట్టి అప్పలనాయుడులను భారీ మెజారిటీతో గెలిపిస్తామని టిడిపి మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, ఎఎంసి మాజీ చైర్మన్‌ యినపకుర్తి తోటయ్య దొర అన్నారు. లావేరు సమీపంలో బొడ్డపాడు గెస్ట్‌హౌస్‌ వద్ద సోమవారం టిడిపి, జనసేన నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను పార్టీ నాయకులు, కార్యకర్తలకు పరిచయం చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేసి భారీ ఓట్లు మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మాట్లాడుతూ ప్రజాసేవకు ఒకసారి అవకాశం కల్పించాలని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు. సమావేశంలో నాయకులు పిన్నింటి మధుబాబు. ఇజ్జడా శ్రీనువాసరావు, కూనపల్లి దామోదరరావు, పిన్నింటి మధుబాబు, సంపతిరావు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

 

➡️