అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ చారిత్రాత్మకం

ఎస్‌సి కమిషన్‌ చైర్మన్‌ ఎం.విక్టర్‌ ప్రసాద్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధిఅమరావతిలో ఈనెల 19న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ చారిత్రక కార్యక్రమమని ఎస్‌సి కమిషన్‌ చైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో 125 అడుగుల ఎత్తు గల డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని రూ.400 కోట్లతో నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. దీంతోపాటు అంబేద్కర్‌ స్మృతివనం, లైబ్రరీ, ధ్యాన మందిరం తదితర భవనాల నిర్మాణం పూర్తయిందన్నారు. అంబేద్కర్‌ ఎస్‌సి, ఎస్‌టిలకే పరిమితం కాదని… దేశ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, పౌరులకు హక్కులను ప్రసాదించిన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. అంబేద్కర్‌ చేసిన కృషి, త్యాగం అనిర్వచనీయమన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఎస్‌సి కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ను ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌ ఆర్‌ అండ్‌ బి అతిథిగృహంలో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా నవీన్‌ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ఈనెల 21వ తేదీ వరకు సెలవులో ఉన్నందున, అప్పటివరకు ఆయన స్థానంలో ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

➡️