అభివృద్ధిపై లోకేష్‌ చర్చకు సిద్ధమా!

పలాస నియోజకవర్గం, రాష్ట్రంలో వైసిపి పాలనలో జరుగుతున్న అభి వృద్ధిపై నారా లోకేష్‌ చర్చకు సిద్ధమా? పశుసంవర్థకశాఖ

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

మూలపేట పోర్టు, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ అభివృద్ధికి మచ్చతునక

మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు

పలాస నియోజకవర్గం, రాష్ట్రంలో వైసిపి పాలనలో జరుగుతున్న అభి వృద్ధిపై నారా లోకేష్‌ చర్చకు సిద్ధమా? పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు సవాల్‌ విసిరారు. రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లివూరు సచివాలయం భవనాలను శనివారం ప్రారంభించారు. అనంతరం సర్పంచ్‌ మామిడి భాస్కరరావు అధ్యక్షతన బహి రంగ సభ నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ తిత్లీ తుపాను సమ యంలో నియోజకవర్గంలో చంద్రబాబు తిష్టవేసి దత్తత తీసుకుంటామని చెప్పారు. ఇదేనా దత్తత తీసుకోవడడమా అని ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వంలో నియోజకవర్గానికి చేసిన ఒక్క అభివృద్ధీ చెప్పగలరా ప్రశ్నించారు. శంఖారావం పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్న లోకేష్‌ పలాసలో సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించిన కిడ్నీ రీసెర్చ్‌ ఆస్పత్రి వద్ద ఆగి చూస్తే మా అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. రూ.700 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందించే శుద్ధిజల ప్రాజెక్టు చూస్తే మా అభివృద్ధి ఏమిటో తెలుస్తుందని అన్నారు. టెక్కలిలో పర్యటించే ముందు మూలపేటలో శరవేగంగా జరుగుతున్న పోర్టు పనులు చూడాలని సూచించారు. అభివృద్ధిపై బహిరంగ లేఖ రాస్తే అప్పుడు స్పందించ లేదని గుర్తు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న కుటుంబంగా చెప్పుకుంటున్న యార్లగడ్డ శిరీషలో సంస్కారం లోపించిందని విమర్శించారు. అదేపనిగా పశువుల మంత్రి అంటూ సంస్కార హీనంగా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. సంస్కారహీనంగా మాట్లాడే శిరీష పిచ్చపిచ్చ మాటలకు 106లో ఎక్కించి పశువైద్యం చేయాల్సి ఉంటుంది హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి ఉప్పరపల్లి ఉదరు కుమార్‌, జడ్‌పి వైస్‌చైర్‌పర్సన్‌ పాలిన శ్రీనివాస్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ దువ్వాడ మధుకేశవరావు, వైస్‌ ఎంపిపి వంక రాజు, ఎంపిటిసి ఉపేంద్ర, పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు డైరెక్టర్‌ సూరాడ రాజేశ్వరి గురుప్రసాద్‌, సర్పంచ్‌లు దున్న బాలరాజు, కర్ని శ్రీను, అట్టాడ గోపి, ధర్మారావు, గూడ ఈశ్వరరావు పాల్గొన్నారు.

 

➡️