అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం

అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం

రోడ్డు పనులను ప్రారంభిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

  • రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని పొడుగు నారాయణమ్మ కాలనీ, చిన్నబొందిలీపురం, హరిజన వీధి, హౌసింగ్‌ బోర్డు కాలనీలో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎం.వి పద్మావతి, వైసిపి నాయకులు సాధు వైకుంఠరావు, టంకాల బాలకృష్ణ, నక్క రామరాజు, చల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️