అవినీతికి కేరాఫ్‌ మంత్రి సీదిరి

అవినీతికి కేరాఫ్‌ పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఆరోపించారు. పలాసలో టిడిపి ఆధ్వర్యాన బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా లొత్తూరు, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 31 వార్డుకు చెందిన 125 కుటుంబాలు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి- పలాస

అవినీతికి కేరాఫ్‌ పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఆరోపించారు. పలాసలో టిడిపి ఆధ్వర్యాన బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా లొత్తూరు, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 31 వార్డుకు చెందిన 125 కుటుంబాలు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష సమక్షంలో టిడిపిలోకి చేశారు. వీరికి ఎంపీ టిడిపి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలాసలో కొండలు, గుట్టలు, భూములు సైతం మింగేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అంగన్వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నా సిఎం జగన్‌కు చీమ కుట్టినట్లు లేదన్నారు. అందరి ఆకాంక్షలు నెరవేరాలంటే చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి సీదిరి తట్టాబుట్టా పట్టుకొని పలాస నుంచి పారిపోయే పరిస్థితి వస్తుందని శిరీష పేర్కొన్నారు. 200 పడకల ఆస్పత్రి, కిడ్నీ పరిశోధన కేంద్రం నా తండ్రి శివాజీ హయాంలోనే మంజూరయ్యాయని తెలిపారు. సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు, లొడగల కామేశ్వరరావు, గురిటి సూర్యనారాయణ, మాజీ కౌన్సిలర్‌ సవర రాంబాబు, కొరికాన శంకర్‌, బి.నాగరాజు, మాజీ కౌన్సిలర్‌ కొవ్వూరు సురేష్‌, మల్లా శ్రీనివాసరావు, అంబటి కృష్ణమూర్తి, గోళ్ల చంద్రరావు, సప్ప నవీన్‌ పాల్గొన్నారు.

➡️