‘ఆడుదాం ఆంధ్రా’పై అవగాహనా ర్యాలీ

డివిజన్‌ పరిధిలో ఈనెల 26 నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్‌డిఒ భరత్‌ నాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు తెలిపారు. శనివారం జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో పట్టణ ప్రజలకు ఆడుదాం ఆంధ్రాపై అవగాహన కల్పించేందుకు 2 కె మారథాన్‌

పలాస : 2 కె మారథాన్‌ ప్రారంభించిన చైర్మన్‌ గిరిబాబు

ప్రజాశక్తి- పలాస:

డివిజన్‌ పరిధిలో ఈనెల 26 నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్‌డిఒ భరత్‌ నాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు తెలిపారు. శనివారం జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో పట్టణ ప్రజలకు ఆడుదాం ఆంధ్రాపై అవగాహన కల్పించేందుకు 2 కె మారథాన్‌ కార్యక్రమాన్ని చైర్మన్‌ బల్ల గిరిబాబు ప్రారంభించారు. జూనియర్‌ కళాశాల నుంచి కాశీబుగ్గ మూడు రోడ్లు జంక్షన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తు ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీయడానికి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ఒక ప్లాట్‌ఫాంగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు, యువతీ, యువకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎన్‌.రమేష్‌నాయుడు, మున్సిపల్‌ కమిషనర్‌ టి. నాగేంద్ర కుమార్‌, ఎఇ అవినాష్‌, పట్టణ, మండల ప్రభుత్వ అధికారులు, విద్యార్ధులు, క్రీడా కారులు పాల్గొన్నారు.ఇచ్ఛాపురం: ఆడుదాం ఆంధ్రలో భాగంగా శనివారం మున్సిపల్‌ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి చైర్‌పర్సన్‌ రాజ్యలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది, ఆర్‌పిలు, వార్డు వాలంటీర్లు ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రంలో వైస్‌ చైర్‌పర్సన్‌ భారతి దివ్య, పట్టణ వైసిపి అధ్యక్షులు బలివాడ ప్రకాశరావు పట్నాయక్‌, కౌన్సిలర్లు బచ్చు జగన్‌, పిలక సంతోష్‌, పరపటి కోటి, నీలపు ఢిల్లీ, జెఎసి కన్వీనర్‌ సాలిన ఢిల్లీ, కో-అప్షన్‌ సభ్యులు సయ్యద్‌ సుల్తానా, ప్రత్తి అవినాష్‌, మున్సిపల్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.నేడు 3కె రన్‌ శ్రీకాకుళం అర్బన్‌: ఆడుదాం ఆంధ్రాకు సంఘీభావంగా నగరంలో ఆదివారం ఉదయం 6 గంటలకు 3కె రన్‌ నిర్వహిస్తున్నట్టు వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మెంటాడ స్వరూప్‌ తెలిపారు. ఈ మేరకు ఆడుదాం ఆంధ్రాటీ షర్ట్స్‌లను శనివారం విడుదల చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలకు ప్రాదాన్యత ఇస్తుందని అన్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌లు పాల్గొంటారని చెప్పారు. నగరంలోని పొట్టిశ్రీరాములు జంక్షన్‌ నుంచి స్టేడియం వరకు 3కె రన్‌ ఉంటుందని తెలిపారు.ఆమదాలవలస: ఆడుదాం ఆంధ్రా ప్రారంభోత్సవ సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆదివారం నియోజకవర్గస్థాయిలో 2కె రన్‌ జరుపనున్నట్లు కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు పట్టణ శివారున వైఎస్‌అర్‌ విగ్రహ కూడలి నుంచి కృష్ణాపురం జంక్షన్‌ వరకు 2కె రన్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్రాలో నమోదు చేసుకున్న క్రీడాకారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, యువత, విద్యార్థులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి శాసనసభాపతి తమ్మినేని సీతారాం హాజరుకానున్నారని తెలిపారు.

 

➡️