ఎంపిడిఒలు బాధ్యతల స్వీకరణ

టెక్కలి ఎంపిడిఒ కె.విజయలక్ష్మి గురువారం బాధ్యతలు ఈమె మన్యం జిల్లా బలిజిపేట నుంచి బదిలీపై

టెక్కలి రూరల్‌ : పుష్పగుచ్ఛం అందజేస్తున్న సిబ్బంది

టెక్కలి రూరల్‌ :

టెక్కలి ఎంపిడిఒ కె.విజయలక్ష్మి గురువారం బాధ్యతలు ఈమె మన్యం జిల్లా బలిజిపేట నుంచి బదిలీపై టెక్కలి వచ్చారు. టెక్కలిలో పనిచేస్తున్న చింతాడ లక్ష్మీబాయి విజయనగరం జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ మండలంలో వేసవికాలం దృష్టిలో పెట్టుకొని తాగునీరు ఇబ్బందులు లేకుండా చూస్తారని అన్నారు. ముందుగా మండల కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో హెచ్‌.వి.రమణమూర్తి, ఏరియా కో-ఆర్డినేటర్‌ శిష్టు శ్రీరాములు, ఎపిఎం గురుబెల్లి నారాయణరావు పాల్గొన్నారు. కవిటి: మండల పరిషత్‌ కార్యాలయం పరిపాలన అధికారి కె.శ్రీనివాస రెడ్డికి ఎంపిడిఒగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎంపిడిఒగా పనిచేస్తున్న పి.సూర్యనారాయణరెడ్డికి ఇటీవల విజయనగరం బదిలీ చేశారు. దీంతో ఖాళీగా ఉన్న ఎంపిడిఒ పోస్టును ఎఒ శ్రీనివాసరెడ్డితో భర్తీ చేశారు.కోటబొమ్మాళి: స్థానిక మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిగా ఎచ్చెర్ల పద్మజ బాధ్యతలు స్వీకరించారు. ఈమె విజయనగరం జిల్లా కొత్తవలస మండల పరిషత్‌ అభివృద్ది అధికారిగా పనిచేస్తూ బదిలిపై వచ్చారు. ఇక్కడ ఎంపిడిఒగా పనిచేసిన కుప్పిలి పణీంద్రకుమార్‌ మన్యం జిల్లా సాలూరు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిగా బదిలీపై వెళ్లారు. కొత్తూరు : స్థానిక ఎంపిడిఒగా పి.త్రివిక్రమరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజయనగరం జిల్లా మెంటాడకు నుంచి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఎంపిడిఒ ఎం.పావని విజయనగరం జి ల్లా మెరకముడిదాం ఎంపిడిఒగా బదిలీపై వెళ్లారు.

 

➡️