ఎన్నాళ్లీ సాగునీటి వివక్ష?

ఇచ్ఛాపురం నియోజకవర్గ రైతాంగం సాగునీటి పంపిణీలో ఇంకెన్నాళ్లు వివక్ష ఎదుర్కోవాలని, ఎప్పటికి తమకు సాగునీరు అందిస్తారని నియోజకవర్గంలోని రైతు కుల సంఘం నాయకులు ప్రశ్నించారు. వ్యవసాయమే జీవనాధారమైన నియోజకవర్గంలో సాగునీరు లేక వలసలు పెరిగిపోతున్నా యని, కమతాలు తరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని గొర్రెలపాడులోని ఎఎంసి కార్యాలయ ఆవరణ లో

మాట్లాడుతున్న డాక్టర్‌ శివాజీ

ప్రజాశక్తి – కవిటి

ఇచ్ఛాపురం నియోజకవర్గ రైతాంగం సాగునీటి పంపిణీలో ఇంకెన్నాళ్లు వివక్ష ఎదుర్కోవాలని, ఎప్పటికి తమకు సాగునీరు అందిస్తారని నియోజకవర్గంలోని రైతు కుల సంఘం నాయకులు ప్రశ్నించారు. వ్యవసాయమే జీవనాధారమైన నియోజకవర్గంలో సాగునీరు లేక వలసలు పెరిగిపోతున్నా యని, కమతాలు తరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని గొర్రెలపాడులోని ఎఎంసి కార్యాలయ ఆవరణ లో నియోజకవర్గ రైతుకుల సంఘ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వంశధార సాధనా కమిటీ కన్వీనర్‌ ప్రధాన శివాజీ మాట్లాడుతూ వంశధార నదీ జలాలు పూర్తిస్థాయిలో వినియోగిస్తే ఇచ్ఛాపురం చివరి వరకు సాగునీటికి కొరత ఉండదని అన్నారు. ముఖ్యంగా నేరడి బ్యారేజ్‌ సమస్యలు తొలగిపోతే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఇటీవల పలాస వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి దీనిపై వినతిపత్రం అందించామని అన్నారు. దీనిపై సిఎం స్పందిస్తూ వంశధార ఫేజ్‌-3లో దీన్ని అమలు చేద్దామని అన్నట్టు తెలిపారు. పారిశ్రామికంగా వెనుకబడిన ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 80 శాతం ప్రజలకు వ్యవసాయమే జీవనాధారంగా ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో స్థానికులు ఆర్థికంగా పరిపుష్టి పొందాలన్నా, వలసలు తగ్గాలన్నా నదీ జలాల అనుసంధానం తప్పనిసరని అన్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి సంగారు లక్ష్మీనారాయణ, జీడి మద్దతు ధర పోరాట కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే నేటి దుస్థితికి కారణమని ఆరోపించారు. చిత్తశుద్ధితో కృషిచేస్తే జిల్లాలో ప్రతి సెంటుకూ నీరందుతుందని అన్నారు. రైతుకుల సంఘం అధ్యక్షుడు జెన్నెల ప్రసాదరావు, నర్తు నరేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ నియోజకవర్గం వరకు రావాల్సిన నదీ జలాలు మధ్యలోనే ఆగిపోతున్నాయని, వంశధార బాహుదా నదీ జలాలు అనుసంధానం జరిగి నియోజకవ ర్గానికి సాగునీరు అందించేవరకు పోరాటం చేయాలని సూచించా రు. సమావేశంలో నియోజకవర్గంలోని రైతులు, రైతు కుల సంఘం సభ్యులు పా ల్గొన్నారు.

 

➡️