ఒక్కఛాన్స్‌తో రాష్ట్రం అధోగతి

సిఎం జగన్మోహన్‌ రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఒక్కఛాన్స్‌తో రాష్ట్రం

ఆమదాలవలస : ప్రచారం చేస్తున్న రవికుమార్‌, రామ్మోహనరావు

ఆమదాలవలస :

సిఎం జగన్మోహన్‌ రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఒక్కఛాన్స్‌తో రాష్ట్రం అదోగతి పాలైందని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని తోటాడ, అక్కివరం పంచాయతీల్లో ఇంటింటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించా రు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వైసిపి పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. శ్యాండ్‌, ల్యాండ్‌, మద్యం వంటి వనరులను దోచుకొని దాచుకున్న ఘనత జగన్మోహన్‌ రెడ్డికే దక్కిందన్నారు. రానున్న ఎన్నికలలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి టిడిపిని ఆదరించి సైకిల్‌ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని ప్రజలను కోరారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పేడాడ రామ్మోహనరావు, పైడి మురళీ మోహనరావు, టిడిపి మండల అధ్యక్షులు నూక రాజు, ఢిల్లేశ్వరరావు, తమ్మినేని చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.కోటబొమ్మాళి: మండలం అక్కయ్యవలసలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బోయిన రమేష్‌, మండల నాయకులు హరివరప్రసాద్‌, వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, తర్ర రామకృష్ణ, కర్రి అప్పారావు, గొండు లక్ష్మణరావు, హనుమంతు అప్పలరాజు, బాడాన రమణమ్మ పాల్గొన్నారు. అచ్చెన్నాయుడు సమక్షంలో పలువురు చేరికస్థానిక టిడిపి కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన వైసిపి కార్యకర్తలు, నాయకులు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. వీరికి అచ్చెన్నాయుడు పార్టీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మేఘవరం పంచాయతీ నుంచి యెదురు శంకర్‌ రెడ్డి, నందిగాం కర్రెన్న, దల్లి ఎర్రయ్య, జలుమూరి ధనుంజయతో పాటు 100 కుటుంబాలు చేరారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు బగాది శేషగిరిరావు, జీరు భీమారావు, నాయకులు పాల్గొన్నారు. సోంపేట: మండలంలోని రుషికుద్ద పంచాయతీలో గురువారం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ జనసేన, బిజెపి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆరు పథకాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా టిడిపి కూటమికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు దాసరి రాజు, లోల్ల రాజేష్‌, స్థానిక నాయకులు సంధి జానకిరామ్‌, టి హరినాథ్‌, టి.ఢిలేష్‌, ఎన్‌.జయరావు పాల్గొన్నారు.

 

➡️