గడప గపడకు తాగునీరు అందించడమే లక్ష్యం

ప్రతి గడపకు తాగునీరు అందించడమే ప్రభుత్వ

ఆమదాలవలస : మంచినీటి కుళాయిలను ప్రారంభిస్తున్న స్పీకర్‌ సీతారాం

ఆమదాలవలస:

ప్రతి గడపకు తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం మండలం రామచంద్రాపురం, పొన్నాంపేట గ్రామాల్లో రూ.90 లక్షలతో జల జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయిల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీరు అవసరాన్ని గుర్తించిన సిఎం జగన్మోహన్‌ రెడ్డి జల జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయిల పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో తాగునీరు అందిస్తున్నారన్నారు. అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని స్పీకర్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి తమ్మినేని శ్రీరామ్మూర్తి, జెడ్‌పిటిసి బెండి గోవిందరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, సర్పంచ్‌ ప్రతినిధి చల్లా సింహాచలం, ఎంపిటిసి ప్రతినిధి రౌతు దామోదర్‌ నాయుడు పాల్గొన్నారు.పొందూరు: మేజర్‌ పంచాయతీ పరిధిలోని జోగన్నపేటలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బి.అర్‌.అంబేద్కర్‌, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాలకు పూలమాలవేసి నివాళ్లర్పించారు. ఈయన వెంట జెడ్‌పిటిసి లోలుగు కాంతారావు, ఎంపిపి ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, జై ప్రతాప్‌ కుమార్‌, నాయకులు మోహన్‌ పాల్గొన్నారు.

 

➡️