గోరుముద్ద నాణ్యతపై స్పీకర్‌కు ఫిర్యాదు

మండలంలోని గోనెపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజనం అధ్వానంగా

స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్న విద్యార్థులు

సరుబుజ్జిలి: మండలంలోని గోనెపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేశారు. బుధవారం గోనెపాడు గ్రామంలో జలజీవన్‌ మిషన్‌ పనులకు శంకుస్థాపన చేసి తిరిగి వెళ్తున్న క్రమంలో జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థులు బగాది సుమంత్‌, లడగల దివాకర్‌, మెట్ట భాను ప్రసాద్‌, కంచరాపు బాలు, గొండు భార్గవ్‌తో పాటు మరో 15 మంది విద్యార్థులు స్పీకర్‌ వద్దకు వచ్చి తమ పాఠశాలలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటుందని, ఆ భోజనాన్ని తినలేక పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని స్పీకర్‌ తమ్మినేని సీతారాం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన స్పీకర్‌ విద్యార్థులకు న్యాణ్యమైన భోజనం అందించకపోవడం మంచి పద్ధతి కాదని దీనిపై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని విద్యార్థులకు హామీ ఇచ్చి అక్కడ నుండి వెనుదిరిగారు.

 

➡️