చేనేత సంఘాల సమస్యలు పరిష్కరిస్తాం

చేనేత సంఘాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆప్కో ఎమ్‌డి

పత్తిని పరిశీలిస్తున్న ఆప్కో ఎమ్‌డి పావనమూర్తి

ఆప్కో ఎమ్‌డి పావనమూర్తి

ప్రజాశక్తి- పొందూరుచేనేత సంఘాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆప్కో ఎమ్‌డి ఆర్‌.పావనమూర్తి తెలిపారు. పొందూరు మండ ల కేంద్రంలోని సాయిబాబా చేనేత సహకారి సంఘాన్ని, ఏఎఫ్‌కేకే సంఘాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల్లో పేరుకుపో యిన సరుకులను కొనుగోలు చేయడంతో పాటు సంఘాలకు బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకొఉటామని అన్నారు. గతేడాది డిసెంబరు వరకూ చేనేత సహకార సంఘాలకు ఉన్న బకాయిలను చెల్లిస్తుందని అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు సరిపడ్డ స్కూల్‌ యూనిఫారాలను ఉత్పత్తి చేయడానికి తగినంత మంది కార్మికులు లేరని, స్కూల్‌ యూనిఫారాలు తయారు చేసేందుకు సరిపడే నేతకార్మికులు కేవలం కడపలోనే ఉన్నారని అన్నారు. అందుకే ప్రభుత్వం యూనిఫారాల క్లాత్‌ను ఇతర మార్గాల్లో కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. దుప్పట్లు, తువ్వాళ్లు, ఇతర వస్త్రాలను ప్రభుత్వం ఆప్కో నుంచి మాత్రమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. పొందూరు చేనేత సంఘం ద్వారా గోరు అంచు పంచెలు కొనుగోలుకు ఆప్కో సిద్ధంగా ఉన్నా… ఇక్కడ గోరు అంచు పంచెలు అందించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఏఎఫ్‌కేకే సంఘాన్ని పరిశీలించి ఖాదీ వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ఖాదీ కార్మికులకు మరింత ఎక్కువ పనిని కల్పించగలమని సంఘం అధ్యక్ష, కార్యదర్శిలు కామేశ్వరప్రసాద్‌, దండా వెంకటరమణలు పేర్కొన్నారు. ఆప్కో ఎండీతో పాటు చేనేత జౌళ్లశాఖ ఎడి ధర్మారావు, సాయిబాబా చేనేత సంఘం మేనేజర్‌ వట్టం శ్రీనివాసరావు ఉన్నారు.

 

➡️