టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి

టిడిపిలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జెడ్‌పిటిసి మాజీ సభ్యులు బెందాళం రమేష్‌ అన్నారు. కవిటి బెహరా వీధిలో బుధవారం టిడిపి, జనసేన పార్టీ నాయకులు బాబు

కవిటి : పోస్టర్‌ను అందజేస్తున్న నాయకులు

కవిటి: టిడిపిలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జెడ్‌పిటిసి మాజీ సభ్యులు బెందాళం రమేష్‌ అన్నారు. కవిటి బెహరా వీధిలో బుధవారం టిడిపి, జనసేన పార్టీ నాయకులు బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియంతృత్వ పోకడలతో సాగుతున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో రూ.100లు ఇచ్చి ట్రు ఆఫ్‌ ఛార్జీల పేరుతో నెలకు రూ.500లు ప్రజల వద్ద దోచుకుంటోందని ఎద్దేవా చేశారు. ఓ వైపు పెరుగుతున్న ధరలు, తరుగుతున్న ఆదాయాలతో ప్రజలు విసిగిపోయారని, మళ్లీ ఈ మాయదారి ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో కలియతిరుగుతూ టిడిపి జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు వజ్జ రంగారావు, బెందాళం కామరాజు, బి.తిరుమల, కమలహాసన్‌, కె.ముకుంద, లోకేష్‌ బెహరా పాల్గొన్నారు.కోటబొమ్మాళి: మండలంలోని హరిశ్చంద్రపురంలో ఎంపిటిసి మాజీ సభ్యులు హనుమంతు అప్పలరాజు, లింగుబారి రామప్పడు, డోకి నానాజీ, గంగిట్ల అప్పన్న, పూజారి లక్ష్మి బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి టిడిపి మేనిఫోస్టోతో కూడిన పోస్టర్లను అందజేశారు. టెక్కలి : మండలంలోని చిన్నరోకళ్లపల్లిలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరి ఆధ్వర్యాన బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు టిడిపి మేనిఫోస్టో పోస్టర్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. కార్యక్రమంలో హనుమంతు రామకృష్ణ, ఇప్పిలి జగదీష్‌, మహిళా అధ్యక్షులు మెండ దమయంతి, గున్న వెంకటరమణ, బొడ్డు నాగభూషణరావు, కొప్పల నగేష్‌ పాల్గొన్నారు. ఆమదాలవలస : టిడిపితోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని టిడిపి యాదవ సంఘం నాయకుడు నాగళ్ల మురళీధర్‌ అన్నారు. బుధవారం బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమాన్ని పురపాలక సంఘంలోని మెట్టక్కివలసలో నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే 6 గ్యారంటీ పథకాలను వివరించారు. టిడిపి నాయకులు రాడ విజరు కుమార్‌, రాచకొండ రాజు, కనిమెట్ట అశోక్‌ పాల్గొన్నారు.మండలంలోనిశ్రీనివాసాచార్యులపేట సర్పంచ్‌ బొడ్డేపల్లి గౌరీపతిరావు ఆధ్వర్యంలో అక్కులపేట గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. టిడిపితోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు.

 

➡️