నగరంలో ‘ఫ్లాగ్‌ మార్చ్‌’

రానున్న ఎన్నికల నేపథ్యంలో శాంతి

ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం

రానున్న ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలు స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకునేల భరోసా కలిగించడమే ఫ్లాగ్‌ మార్చ్‌ ప్రధాన లక్ష్యమని టూ టౌన్‌ సిఐ ఉమామహేశ్వరరావు అన్నారు. నగరంలో బలగ కూడలి నుంచి ఎసిబి కార్యాలయం నుంచి స్టేట్‌ బ్యాంకు వరకు కేంద్ర బలగాలతో ఫ్లాగ్‌ మార్చ్‌ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా, శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడినా నిర్భయంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతిభద్రతలకు ఎక్కడ విఘాతం కలిగినా ప్రజల్లో భరోసా, ధైర్యం కల్పించడం లక్ష్యంగా ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నామనిచెప్పారు. సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది కలిగించే సంఘటనలు ఎవరు సృష్టించినా తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

➡️