నేటి నుంచి పాఠశాలలు

సంక్రాంతి సెలవుల అనంతర

రేపట్నుంచి ఎఫ్‌ఎ-3 పరీక్షలు

ప్రజాశక్తి – టెక్కలి

సంక్రాంతి సెలవుల అనంతర ఈనెల 22వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. 13 రోజుల సెలవుల అనంతరం బడులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 19వ తేదీ నుంచే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు అదనంగా సంక్రాంతి సెలవులను పొడిగించింది. పెంచిన రెండు రోజుల సెలవులు ఇతర సెలవు దినాల్లో పనిచేయాలని ప్రభుత్వం పేర్కొంది. అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం ఈనెల 23వ తేదీ నుంచి ఎఫ్‌ఎ-3 పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన సిలబస్‌ని ముందస్తుగానే విడుదల చేశారు.

➡️