నేడు కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

నూతన కలెక్టర్‌గా డాక్టర్‌ మనజీర్‌ జిలానీ

ప్రజాశక్తి- శ్రీకాకుళం

నూతన కలెక్టర్‌గా డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు పనిచేసిన కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ను బదిలీ చేస్తూ… ఆయన స్థానంలో నంద్యాల జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న మనజీర్‌ జిలానీ సామూన్‌ను ఇక్కడ నియమించారు. 2012 ఐఎఎస్‌ బ్యాచ్‌కు చెందిన కలెక్టర్‌ విశాఖ మెట్రో పాలిటిన్‌ అడిషనల్‌ కమిషనర్‌గా కొంత కాలం పనిచేశారు. 2021 ఏప్రిల్‌ 28న కర్నూలు జెసిగా బదిలిపై వెళ్లారు. అనంతరం 2022లో ఏప్రిల్‌లో కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో నంద్యాల కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్పీకరించారు.

➡️