నేడు భోగి

Jan 13,2024 22:18 #నేడు భోగి
భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే. కొత్త బట్టలు ధరించి భోగి మంటల్లో భోగి పిడకలు

ప్రజాశక్తి- రణస్థలం

భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే. కొత్త బట్టలు ధరించి భోగి మంటల్లో భోగి పిడకలు వేయడంతో భోగి సంబరాలు మొదలవుతాయి. సాయంత్రం పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు మొదలయాయ్యి. ఇంటింటా సందడి మొదలైంది. పిండి వంటలు గుమగుమలాడుతున్నాయి. కోడి పందాలు డూడూ బసవన్న, ఆటాపాటా సందడి.. ఇంటి ముంగిట రంగు రంగుల హరివిల్లులు, గోబెమ్మలు, భోగి పళ్లు భోగి మంట హరిదాసు కీర్తనలు కొత్త అల్లుళ్లు.. కొత్త సినిమాల సందడిని తీసుకొచ్చింది. ఈ సంబరాల పండగ తెలుగు వారి పెద్ద పండుగ. మూడు రోజులు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజున వచ్చేది ‘భోగి’ పండుగ. భోగి అంటే తొలి రోజు అని అర్ధం. ఈ రోజున ఇంటి ముందు భోగి మంటలను వేస్తారు. ఇక ఈ భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే. కొత్త బట్టలు ధరించి భోగి మంటల్లో భోగి పిడకలు వేయడంతో భోగి సంబరాలు మొదలవుతాయి. సాయంత్రం భోగి పండ్లు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. భోగిపళ్లలో చేమంతి, బంతి పువ్వుల రేకులు, చిల్లర నాణేలు కలిపి పిల్లల.. పిల్లలకు దిష్టి తీసి వాటిని తలపై పోస్తారు.

➡️