పరిశ్రమల్లో మాక్‌ డ్రిల్‌ తప్పనిసరి

పరిశ్రమల్లో మాక్‌ డ్రిల్‌ తప్పనిసరిగా

మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్న రాంబాబు

  • డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ రాంబాబు

ప్రజాశక్తి – ఎచ్చెర్ల

పరిశ్రమల్లో మాక్‌ డ్రిల్‌ తప్పనిసరిగా చేపట్టాలని డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ బి.రాంబాబు స్పష్టం చేశారు. రసాయన పరిశ్రమల్లో విష వాయువుల లీకులను నియంత్రించడానికి, ప్రమాద తీవ్రతను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఆన్‌ సైట్‌ ఎమర్జెన్సీ మాక్‌ డ్రిల్‌ను మండలంలోని పొన్నాడలో గల స్మార్ట్‌కమ్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో బుధవారం నిర్వహించారు. ఈ మాక్‌ డ్రిల్‌ పరిశీలకులుగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు హాజరయ్యారు. ఎమెర్జెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను ఆయన వివరించారు.

 

 

➡️