పాణిగ్రాహి జీవితం నిత్య పోరాట చైతన్యం

విప్లవ సాంస్కృతికోద్యమ యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి పోరాట జీవితానికి వర్తమాన ప్రాసంగికత, ప్రాధాన్యం ఎంతో ఉందని, ఆయన జీవితం నిత్య పోరాట చైతన్యమని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్‌, ప్రజా కళా మండలి రాష్ట్ర సహాయ

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- పలాస విప్లవ సాంస్కృతికోద్యమ యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి పోరాట జీవితానికి వర్తమాన ప్రాసంగికత, ప్రాధాన్యం ఎంతో ఉందని, ఆయన జీవితం నిత్య పోరాట చైతన్యమని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్‌, ప్రజా కళా మండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.నీలకంఠం అన్నారు. ఈ నెల 22న వర్థంతి సందర్భంగా పోరుగడ్డ బొడ్డపాడులో పాణిగ్రాహి స్మారక బహిరంగ సభను నిర్వహించడం ఎంతో విప్లవ స్ఫూర్తిని అందిస్తుందని వారు అన్నారు. ఈ మేరకు బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌, ఉత్తరాంధ్ర మహిళా సంఘం నాయకులు పి.అరుణ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, అరుణోదయ నాయకులు నిశితాసి, కుత్తుం ఢిల్లీరావు, ప్రజా కళాకారుడు వినోద్‌, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 

➡️