పెన్షన్‌ విశ్రాంత ఉద్యోగుల హక్కు

దశాబ్ధాల తరబడి దేశాభివృద్ధిలో భాగస్వాములై సేవలందించిన ఉద్యోగికి తన ఉద్యోగ విరమణ అనంతరం గౌరవ ప్రదంగా శేష జీవితం గడిపేందుకు పెన్షన్‌ అవసరమని, అందువల్ల పెన్షన్‌ హక్కును పరిరక్షించుకోవాల్సిన

శ్రీకాకుళం అర్బన్‌ : మాట్లాడుతున్న శ్రీనివాస్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

దశాబ్ధాల తరబడి దేశాభివృద్ధిలో భాగస్వాములై సేవలందించిన ఉద్యోగికి తన ఉద్యోగ విరమణ అనంతరం గౌరవ ప్రదంగా శేష జీవితం గడిపేందుకు పెన్షన్‌ అవసరమని, అందువల్ల పెన్షన్‌ హక్కును పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ అన్నారు. నగరంలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో పెన్షనర్ల అండ్‌ విశ్రాంత పెన్షనర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యాన అంతర్జాతీయ పెన్షనర్స్‌ డే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు విశ్రాంత ఉద్యోగులకు హానికలిగించే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్‌ దయా, భిక్ష కాదని, విశ్రాంత ఉద్యోగుల హక్కు అని సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తుచేశారు. అతితక్కువ పెన్షన్‌తో ఇబ్బంది పెడుతున్న ఇపిఎస్‌ విశ్రాంత ఉద్యోగులు వృద్ధ్యాపంలో తప్పని సరై ప్రయివేటు సంస్థల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా పెన్షనర్లకు న్యాయం చేయాలని కోరారు. ఎల్‌ఐసి విశ్రాంత ఉద్యోగుల నాయకులు వి.జి.కె.మూర్తి మాట్లాడుతూ భవిష్యత్‌లో అన్ని విశ్రాంత ఉద్యోగ సంఘాలు ఐక్య పోరాటం చేయాల్సిన ఆవశ్యకత పెరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర, ప్రయివేటు సంస్థల విశ్రాంతి ఉద్యోగులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ పెన్షనర్ల న్యాయమైన పోరాటాలకు తమ మద్ధతు ఉంటుందన్నారు. సిపిఎస్‌ రద్దు కోసం ఉద్యోగుల పక్షాన పోరాడుతున్నట్టు గుర్తు చేశారు. విశ్రాంత ఐఎఎస్‌ అధికారి జయప్రకాష్‌ నారాయణ పెన్షన్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను సమావేశంలో ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్యక్ర మంలో ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ విశ్రాంత ఎంప్లాయీస్‌ అసోసియే షన్‌ అధ్యక్ష, కార్యదర్శులు దొంతం పార్వతీశం, మణికొండ ఆదినారాయణమూర్తి, ఎల్‌.అనంతరావు, ఎ.సత్యనారాయణ, శ్రీనివాసరావు, కె.రాజగోపాలరావు, ధర్మరాజు, ఎ.నర్సింగరావు నాయకత్వం వహించారు. అనంతరం ఉషా డెంటల్‌ ఆధ్వర్యాన పెన్షనర్లకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. విశ్రాంత ఉద్యోగులు పెన్షన్‌ పొందుతున్నారంటే నాటి ధరంసింగ్‌ నకారా పోరాట ఫలితమేనని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు అన్నారు. నకారా జయంతిని పురస్కరించుకుని అనురాగ నిలయంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు, జిల్లా అధ్యక్షులు ఎంఎస్‌ఆర్‌ఎస్‌ ప్రకాశరావు, ట్రెజరీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సి.రవికుమార్‌ నరసింహమూర్తి, సోమసుందరరావు పాల్గొన్నారు.శ్రీకాకుళం: జాతీయ పెన్షనర్స్‌ డే సందర్భంగా కళింగ వైశ్య భవన్‌లో నిర్వహించిన పెన్షనర్స్‌ డే కార్యక్రమానికి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్స్‌ ఆరోగ్యంగా జీవితాన్ని గడపాలని, వాళ్ల సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు. అనంతరం సూపర్‌ పెన్షనర్స్‌కు సన్మానం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్‌ సిహెచ్‌ రవికుమార్‌, సైనా సంఘం చైర్మన్‌ డివి దేవ, సీనియర్‌ సిటిజన్స్‌ డిపార్ట్మెంట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.సుజాత, వివిధ సంఘ అధ్యక్షులు నేతింటి రామారావు, బెజవాడ రామారావు, శ్యామ్‌, హేమ సుందర్‌, సత్యనారాయణ, కూన తవిటి నాయుడు, విశాఖ గ్రామీణబ్యాంకు రీజన్‌ మేనేజర్‌ అనంతరావు, విశాఖ గ్రామీణ బ్యాంకు మాజీ బ్రాంచ్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. కవిటి: మలిదశలో ఉన్న విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు అండగా నిలవాలని విశ్రాంత ఉద్యోగుల ప్రతినిధులు జి.జానకిరామయ్య, పి.ఢిల్లేషు, పూడి భీమారావు కోరారు. విశ్రాంత ఉద్యోగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ముందుగా తమ ఆద్యుడు డిఎస్‌ నాఖార విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. పెండింగులో ఉన్న 185 నెలలకు సంబంధించిన డిఎ, పిఆర్‌సి ఎరియర్స్‌ విడుదల చేయాలని కోరారు. అలాగే తమ సంఘంలోని సభ్యులైన పిరియ కృష్ణారావు, పండి బలరామ్మూర్తి, జన్నెల ప్రసాదరావు, దండాసి రౌలో, మోగిలిపురి సింహాచలంను ఘనంగా సన్మానించారు. పలాస : కాశీబుగ్గ కన్యకా పరమేశ్వరి ఆలయ కళ్యాణ మండపంలో అఖిల భారత పిన్షనుదారుల సంఘం ఆధ్వర్యాన 18 మంది విశ్రాంత ఉద్యోగులకు ఘనంగా సన్మానించారు. అధ్యక్షులు తమ్మినాన మాధవరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశం పలాస సబ్‌ ట్రెజరీ అధికారి లక్ష్మీపురం రామారావు, పూర్వ అధ్యక్షులు పైల సూర్యనారాయణ మాస్టారు, సెక్రటరీ నెమలిపురి అప్పారావు, జనరల్‌ సెక్రటరీ బి.నరసింగరావు, టి.వి.రెడ్డి మస్టారు, డాక్టర్‌ తెప్పల కృష్ణమూర్తి, బూరెల జగ్గారావు, తమ్మినేని కుశరాజు, సుందరరావు, తమ్మినేని వైకుంఠరావు, భగీరథ పాణిగ్రహీ, బి.దొర, హనుమంతు కృష్ణమూర్తి పాల్గొన్నారు.ఇచ్ఛాపురం : ప్రభుత్వ హైస్కూల్‌లో పెన్షన్లను సన్మానించారు. ముందుగా డిఎస్‌ నకారీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. టెక్కలి రూరల్‌ : పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఎస్‌టిఒ భాగ్యలక్ష్మి అన్నారు. అఖిల భారత పెన్షనర్ల దినోతసవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో హోమియో, దంత, నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షులు రోణంకి రామచంద్రరావు, కార్యదర్శి కె.ధనుంజయరావు, కోశాధికారి బి.అయ్యబాబు, జి.వెంకటరెడ్డి, దల్లి వీరాస్వామి పాల్గొన్నారు. ఆమదాలవలస: పట్టణంలో ఎస్‌ఎస్‌ఎన్‌ కళ్యాణ మండపంలో పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు సురవరపు సిమ్మినాయుడు అధ్యక్షతన పెన్షనర్ల సంఘ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సబ్‌ట్రెజరీ ఆఫీసర్‌ ఎస్‌.సువర్ణ రాజు, సంఘ గౌరవ అధ్యక్షుడు బొడ్డేపల్లి మోహనరావు, స్టేట్‌బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ అనంత నారాయణమూర్తి పాల్గొన్నారు. సభలో 14 మంది సీనియర్‌ పెన్షనర్లకు ఎస్‌టిఒ చేతుల మీదగా సన్మానం చేశారు. పొందూరు: స్ధానిక పట్టుశాలి కళ్యాణ మండపంలో జాతీయ పెన్షన్‌దారుల దినోత్సవం సందర్భంగా సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పెన్షన్‌దారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంకం ధర్మారావు, విశ్రాంత ఉద్యోగుల ప్రాంతీయ సంఘం కార్యదర్శి పి.సూర్యప్రకాశరావు, దండా సూరిబాబు, బి.సూర్యనారాయణ, వి.వి.గోపాలరావు పాత్రో, వై.అప్పలరాజు, కూన కృష్ణారావు, బొడ్డేపల్లి జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత పెన్షన్‌దారుల ఉద్యమనేత దివంగత డిఎస్‌.నకరా చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రణస్థలం: పెన్షన్స్‌ డే సందర్భంగా రణస్థలంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు నరసింహులు నాయుడు, పాపి నాయుడుతో పాటు టిడిపి నేత కలిశెట్టి అప్పలనాయుడు, పెన్షనర్ల సంఘం ప్రతినిధులు బాలి రామునాయుడు, మేడూరి సత్యనారాయణ, మన్నె కృష్ణానందం, పొన్నాడ సత్యనారాయణ, రెడ్డి లక్ష్మణరావు, వెంకటరమణ, సిహెచ్‌ గోపాలరావు, మాడుగుల రామారావు, మీసాల సీతంనాయుడు, వెంకటస్వామి పాల్గొన్నారు.

 

➡️