పేదలకు దుస్తుల పంపిణీ

జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం ఎన్ని సేవా కార్యక్రమాలను చేసినా వారి రుణం తీర్చుకోలేనిదని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు

టెక్కలి రూరల్‌ : దుస్తులు పంపిణీ చేస్తున్న సత్యనారాయణ దంపతులు

ప్రజాశక్తి- పొందూరు

జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం ఎన్ని సేవా కార్యక్రమాలను చేసినా వారి రుణం తీర్చుకోలేనిదని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ అన్నారు. శనివారం మండలం కింతలి గ్రామంలో దుంపల వెంకట సత్యనారాయణ, లక్ష్మీకాంతమ్మ దంపతుల జ్ఞాపకార్ధం వారి కుమారుడు దుంపల సన్యాసిరావు విజయలక్ష్మి దంపతులు నిర్వహించిన పేదలకు వస్త్రదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులను 18ఏళ్లుగా స్మరించుకుంటూ వారికి విగ్రహాలను పెట్టి ప్రతీఏటా సంక్రాంతిని పురస్కరించుకుని సన్యాసిరావు మాష్టర్‌ నిరుపేదలకు వస్త్రదానం చేయడం గొప్ప విషయమన్నారు. తల్లిదండ్రులు లేకపోతే మనం లేమన్న విషయాన్ని ప్రతిఒక్కరు గమనించాలని, ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సన్యాసిరావు మాష్టర్‌ ప్రస్తుత సమాజంలో యువతకు ఆదర్శమన్నారు. అనంతరం పరిసర గ్రామాలకు చెందిన వందలమంది నిరుపేదలకు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పైడి రాంప్రసాద్‌, విశ్రాంత సిఇఒ సురంగి మోహనరావు, విశ్రాంత ఆర్‌ఐఒ గవర గోవిందరావు, టిడిపి మండల అధ్యక్షుడు చిగిలిపల్లి రామ్మోహనరావు, పట్టణ కార్యదర్శి చిట్టి నాగభూషణరావు, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు గాడు నారాయణరావు, జిల్లా తెలుగుయువత జనరల్‌ సెక్రటరీ బలగ శంకర భాస్కరరావు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.మండల కేంద్రంలో పట్టుశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మంది నిరుపేదలకు ఈ వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో పట్టుశాలి సంక్షేమ సంఘం సభ్యులు ఎం.శ్రీరంగనాయకులు, డివిఎస్‌ ప్రకాశరావు, కోరుకొండ సాయికుమార్‌, సత్యారావు, బాసా ఆనంద్‌మోహన్‌, ఎం.కృష్ణారావు పాల్గొన్నారు.శ్రీకాకుళం అర్బన్‌ : నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో పేదలకు శ్రీకాకుళం సెంట్రల్‌ లయన్స్‌ క్లబ్‌, వరం ఛారిటబుల్‌ ట్రస్టు సౌజన్యంతో ఏర్పాటు చేసిన దుస్తులను అడిషినల్‌ క్రైమ్‌ ఎస్‌పి పి.విఠలేశ్వరరావు పంపిణీ చేశారు. మెంటార్‌ నటుకుల మోహన్‌, జోన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ బాడాన దేవభూషణరావు, సెక్రటరీ రామ్‌ గోపాల్‌, ట్రెజరర్‌ శిల్లా మణి, గుత్తు చిన్నారావు పాల్గొన్నారు. నరసన్నపేట : సంక్రాంతిని పురస్కరించుకొని ‘చారిటీ బాక్సు’ ఆధ్వర్యాన విశాఖపట్నం, బాపట్ల జిల్లా మార్టూరు, పాయకరావుపేటలోని మాసాహెబ్‌పేట, నరసన్నపేటలో నిరాశ్రయులకు నిత్యావసరాలు అందజేశామని కొప్పుల భాస్కరరావు తెలిపారు. ఒక్కొక్కరికీ 15 రకాల వస్తువులు, 15 కేజీల బరువు గల సామగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కవిత, శంకర్‌ పంతులు శివ తదితరులు పాల్గొన్నారు.నౌపడ: సంతబొమ్మాలి మండలం నౌపడ గ్రామంలో తల్లిదండ్రు కోల్పోయిన అనాధ బాలికలకు బిగ్‌ హెల్ప్‌ స్వచ్ఛంద సంస్థ వస్తువులను, నగదును శనివారం అందజేశారు. ఈ సందర్భంగా బిగ్‌ హెల్ప్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ నౌపడ ప్రాజెక్టు చైర్మన్‌ సివి రాజా మాస్టర్‌ మాట్లాడుతూ సంస్థ తరఫున ఎండి చాంద్‌ పాషా, ఎన్‌ఆర్‌ఐలు సతీష్‌, అనిత సహకారంతో గత నాలుగేళ్లుగా సహాయం చేస్తున్నామన్నారు. వీరికి నాలుగు జతల బట్టలు, నైట్‌ డ్రెస్స్‌లు, కాస్మోటిక్స్‌, స్టేషనరీ, రూ.2 వేలు సగదు అందించామన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎల్‌.జయ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.పలాస: పలాస కాశిబుగ్గలో 23 మంది తెలగ పేద కుటుం బాలకు బియ్యం, రేషన్‌, దుస్తులు, నగదు అందజేయడం జరిగిందని రాజరాజేశ్వరి దేవి తెలగ సంఘం అధ్యక్షుడు శీలం రూప సుందర్‌, కార్యదర్శి వాసు, కోశాధికారి అప్పారావులు తెలిపారు. ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు పేద కుటుంబాలకు సరుకులు అందిస్తున్నామని, ఈ ఏడాది కూడా 23 మంది పేద కుటుంబాలకు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో సంఘ వైస్‌ ప్రెసిడెంట్‌ బల్ల శ్రీనివాసరావు, పలాస కాశీబుగ్గ తెలగ సంఘ సభ్యులు పాల్గొన్నారు. సంత బొమ్మాళి: వల్లేవలసకు చెందిన మనబడి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ తరుపున గోవిందపురం, వడ్డివాడ, నర్సాపురం పంచాయతీల్లో నిరుపేద కుటుంబాలకు 15 రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను శనివారం పంపిణీ చేశారు. సంక్రాంతిని బీద కుటుంబాలు ఆనందంగా జరుపుకోవాలని ఈ సరుకులు పంపిణీ చేశామని సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు రెడ్డి సూరిబాబు మాస్టర్‌, గేదెల శివారెడ్డి, రామినాయుడు మాస్టర్‌, ఇప్పిలి అప్పన్న పాల్గొన్నారుటెక్కలి రూరల్‌: టెక్కలి మేజర్‌ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు టెక్కలికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త టంకాల సత్యనారాయణమూర్తి(బాబ్జి) సుగుణ దంపతులు శనివారం దుస్తులు పంపిణీ చేశారు. పారిశుద్ధ కార్మికులు, మంచినీటి సరఫరా కార్మికులకు, శానిటేషన్‌ కార్మికులు 84 మందికి మహిళలకు చీరలు, పురుషులకు డ్రెస్‌ మెటీరియల్‌ పంపిణీ చేశారు. ఈయనతో పాటు వెంకటరమణ మూర్తి ఉన్నారు.

 

➡️