మరణంలోనూ మానవత్వం

అవయవ దానం ఓ గొప్ప

ఉషారాణి (ఫైల్‌)

  • బ్రెయిన్‌డెడ్‌ మహిళ అయవయదానం

ప్రజాశక్తి – శ్రీకాకుళం

అవయవ దానం ఓ గొప్ప సంకల్పం. తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపే ఓ అద్భుత కార్యక్రమం. అటువంటి అవయవదానం కార్యక్రమానికి మరోమారు వేదికైంది జెమ్స్‌ హాస్పిటల్‌. బ్రెయిన్‌ డెడ్‌ అయిన పాతపట్నం మండలం పెదలోగిడికి చెందిన జైనవలస ఉషారాణి (40) అవయవాలు దానం చేసేందుకు ఆమె కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. పద్మావతి ఈనెల 19న తన మరిది ఇళ్లుచూపులు శుభకార్యానికి వెళ్తూ హిరమండలం గొట్టాబ్యారేజీ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఉషారాణి తీవ్రంగా గాయపడి జెమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. మూడు రోజులుగా వెంటిలేటర్‌పై ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. అయినా చికిత్సకు ఏమాత్రం స్పందించలేదు. ఈనెల 21న అర్ధరాత్రి దాటిన తరువాత బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైదులు చెప్పారు. ఆమె భర్త కృష్ణారావు, పిల్లలు నిఖిత, పల్లవి, జోషిత్‌ ఉషారాణి అవయవదానానికి ముందుకు రావడంతో వైద్యులు జీవన్‌దాన్‌కి దరఖాస్తు చేయడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. ఆమె లివర్‌ను విశాఖపట్నంలో పిన్నాకల్‌ హాస్పిటల్‌కు, ఒక కిడ్నీని విశాఖపట్నం కెజిహెచ్‌కు, మరో కిడ్నీని జెమ్స్‌ ఆస్పత్రికి, రెండు కళ్లను రెడ్‌క్రాస్‌కు అందించారు. అవయవదానానికి అంగీకరించిన కుటుంబసభ్యులకు ధ్రువపత్రాలను అందజేశారు. నివాళ్లర్పించిన జెమ్స్‌ సిబ్బందిఅవయవదానం చేసిన ఉషారాణి మృతదేహానికి జెమ్స్‌ ఆస్పత్రి వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది పూలమాలలు ఉంచి నివాళ్లర్పించారు. ఆమె మృతదేహం తరలిస్తున్న దారిపొడవునా విద్యార్థినులు పూలు చల్లి ఉషారాణి అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఎఒ ఎస్‌.రామ్మోహన్‌, డైరెక్టర్‌ సుధీర్‌, ప్రిన్సిపాల్‌ లకీë లలిత, హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ అశోక్‌ రెడ్డి, క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌ శివఅన్వేష్‌, ఆర్‌ఎఒఒలు బాలమురళీ, ప్రవీణ్‌, ఆపరేషన్‌ మేనేజర్‌ జోత్స్న పాల్గొన్నారు.

➡️