మరికొద్ది రోజులు చూద్దాం

మూడు రోజులుగా శ్రీకాకుళం నియోజకవర్గం

అప్పలసూర్యనారాయణ

మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

మూడు రోజులుగా శ్రీకాకుళం నియోజకవర్గం టిడిపిలో కలకలం రేపిన టిక్కెట్టు వివాదాన్ని పరిష్కరించడానికి చంద్రబాబు దూతగా జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ గుండ దంపతులను సోమవారం రాత్రి కలిశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల్లో ఉన్న గుండ లక్ష్మీదేవిని కాదని టిక్కెట్‌ అసమ్మతి నాయకుడు గొండు శంకర్‌కు కేటాయించడాన్ని తప్పుపడుతూ గుండ దంపతులు అభ్యంతరం తెలిపారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచన ఉన్న అధిష్టానం అసమ్మతి వాదులను అందలమెక్కిస్తారా? అని వారు ప్రశ్నించారు. నియోజకవర్గంలో అభ్యర్థిని తప్పక మార్చాలని వారు జిల్లా అధ్యక్షులకు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే మంగళవారం తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు గుండ అప్పలసూర్యనారాయణ ప్రకటించారు. నాలుగు దశాబ్ధాలుగా టిక్కెట్‌ కేటాయించిన ప్రతిసారి అసమ్మతిని రాజేస్తున్నారని, క్రమశిక్షణ గల నాయకులకు పార్టీలో ఇస్తున్న గుర్తింపు ఏమిటని ప్రశ్నించిన తర్వాత సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లతానని అన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే రీతిలో నిర్ణయాలు తీసుకోవద్దని నచ్చజెప్పినట్టు తెలిపారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా తమ నిర్ణయం ఉంటుందని రవికుమార్‌కు వివరించారు.

 

➡️