మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ఎన్నికలు సజావుగా జరగాలంటే సక్రమమైన ఓటర్ల

ఓటర్ల జాబితాలో లోపాలకు తావీయొద్దు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఎన్నికలు సజావుగా జరగాలంటే సక్రమమైన ఓటర్ల జాబితా అవసరమని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులపై ఉందన్నారు. నగరంలోని ప్రజాసదన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. అర్హుల ఓట్లను తొలగించడం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరమే అవుతుందన్నారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు సరిచేసి, సక్రమమైన ఓటర్ల జాబితా తయారు చేయడం కోసమే ఎన్నికల కమిషన్‌ జనవరి 12 వరకు గడువు పెంచిందని తెలిపారు. శ్రీకాకుళం పార్లమెంట్‌ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లోని 2,048 పోలింగ్‌ కేంద్రాల్లో 16,14,999 ఓటర్లు ఉన్నారని వివరించారు. నరసన్నపేట నియోజకవర్గంలోని గాతలవలస, మబుగాం, మత్స్యకార గ్రామాల్లో తాత్కాలిక వలస వెళ్లిన ఓటర్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. పోలాకి మండలంలో చేర్పులు, తొలగింపులపై మరోసారి విచారణ చేసి అర్హులను ఓటర్ల జాబితాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితాలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎం.జె బాబు పాల్గొన్నారు.

 

➡️