మార్చి 9న జాతీయ లోక్‌ అదాలత్‌

జాతీయ లోక్‌ అదాలత్‌ మార్చి 9న నిర్వహి స్తున్నట్టు జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జాతీయ లోక్‌ అదాలత్‌ మార్చి 9న నిర్వహి స్తున్నట్టు జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో, పోలీసులతో శనివారం జిల్లా కోర్టులో సమావేశా న్ని నిర్వహించారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేయడానికి గల అవకాశాలపై చర్చించారు. పోలీస్‌ యంత్రాంగం ఇప్పటినుంచే అన్ని చర్యలు తీసుకొని కక్షిదారుల కు లోక్‌ అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోవడంతో కలిగే ఉపయోగాలను వివరించాలన్నారు. కేసులు రాజీ చేసుకునేందుకు ఇరు వర్గాలను సంసిద్ధులను చేయాలన్నారు. రాజీ పడదగ్గ క్రిమినల్‌ కేసులు లోక్‌ అదాలత్‌లో పరిష్కరిస్తే పోలీస్‌ అధికారులకు తీవ్రమైన నేరాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందన్నారు. చిన్న రాజీపడదగ్గ కేసులన్నీ రాజీ చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు జిల్లా జడ్జిలు శ్రీదేవి, భాస్కరరావు, మహేంద్ర, ఫణికు మార్‌, అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి అనురాధ, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, అడిషినల్‌ ఎస్‌పి తిప్పేస్వామి, డిఎస్‌పిలు, సిఐలు, ప్రాసిక్యూషన్‌ తరపున మెట్ట మల్లేశ్వరరావు, ప్రభుత్వ న్యాయ వాది వినరు భూషణ్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు నాగభూషణరావు, సుశీల పాల్గొన్నారు.

 

➡️