మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత

శ్రీకాకుళం నగరంలో మౌలిక వసతుల

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

  • రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

శ్రీకాకుళం నగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. నగరంలోని ఎల్‌బిఎస్‌ కాలనీలో రూ.9.61 లక్షల వ్యయంతో, దమ్మలవీధిలో రూ.15.80 లక్షల వ్యయంతో, గుజరాతీపేటలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను, ఆదివారంపేటలో రూ.19.80 లక్షల వ్యయంతో నిర్మించిన మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల భవనాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వాలు కషి చేయాలని, అదే తాము చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎం.వి పద్మావతి, వైసిపి నాయకులు సాధు వైకుంఠరావు, చల్లా శ్రీనివాస్‌, అంధవరపు ప్రసాద్‌, సంతోష్‌, పైడి రాజారావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️