రథసప్తమి ఆదాయం రూ.50.90 లక్షలు

అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలకు పలురూపాల్లో

కమిషనర్‌కు చిత్రపటాన్ని అందజేస్తున్న ఇఒ రమేష్‌బాబు తదితరులు

గతేడాది కంటే రూ.2.25 లక్షలు అధికం

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలకు పలురూపాల్లో రూ.50,90,530 ఆదాయం సమకూరింది. ఆలయానికి వచ్చే యాత్రికులకు 2,400 అభిషేకం టిక్కెట్లు విక్రయిడం ద్వారా రూ.12 లక్షల మేర ఆదాయం వచ్చింది. రూ.500కు విక్రయించిన విశిష్ట దర్శనం టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.5.05 లక్షలు, రూ.100కు వియ్రించిన 7,430 టిక్కెట్ల ద్వారా రూ.7.43 లక్షలు, విరాళాల ద్వారా రూ.57,690, కేశఖండన కోసం విక్రయించిన 1219 టిక్కెట్ల ద్వారా రూ.48,760, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.14,12,580, రూ.500 విఐపి టిక్కెెెట్లు 2,247 విక్రయించగా రూ.11,23,500 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇఒ డి.ఎల్‌.వి రమేష్‌బాబు తెలిపారు. గతేడాది ఈ ఉత్సవాల్లో రూ.48,65,508 ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.2,25,022 అదనపు ఆదాయం సమకూరింది.అరసవల్లికి పోటెత్తిన యాత్రికులుఅరసవల్లి ఆలయానికి ఆదివారం యాత్రికులు పోటెత్తారు. మాఘమాసం ఆదివారం కావడంతో రద్దీ పెరిగింది. దీనికితోడు విఐపిలు తరలివచ్చారు. విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యనార్‌, విజయవాడ టెలికాం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.శేషాచలం, సౌత్‌ సెంట్రల్‌ డిఆర్‌ఎం ఉన్నం అక్కిరెడ్డి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారి జ్ఞాపికలను ఆలయ ఇఒ రమేష్‌బాబు అందజేశారు. ఆదివారం ఒక్కరోజు టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,92,300, విరాళాల రూపంలో రూ.1,57,741, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2,57,075 మొత్తం రూ.7,07,116 ఆదాయం సమకూరినట్లు ఇఒ తెలిపారు.

 

➡️