రాజగోపాలరావు సేవలు చిరస్మరణీయం

వంశధార ప్రాజెక్ట్‌ సాధకులు, మాజీ ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు చిరస్మరణీయుడని రాష్ట్ర కళింగ సంక్షేమ అభివృద్ధి

శ్రీకాకుళం అర్బన్‌ : విగ్రహం వద్ద నివాళ్లర్పిస్తున్న రామారావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

వంశధార ప్రాజెక్ట్‌ సాధకులు, మాజీ ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు చిరస్మరణీయుడని రాష్ట్ర కళింగ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ దుంపల రామారావు అన్నారు. బొడ్డేపల్లి రాజగోపాలరావు 32వ వర్ధంతి సందర్భంగా గురువారం నగరంలో ఏడు రోడ్ల కూడలి, సింహద్వారం వద్ద ఉన్న బొడ్డేపల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లర్పించి మాట్లాడుతూ రాజగోపాలరావు జిల్లాలో రైతులకు ముద్దుబిడ్డగా చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో బిసి సంఘాల నాయకులు బొడ్డేపల్లి దామోదరరావు, కెవిఎస్‌ నాయుడు, ఉమాశంకర్‌, తిర్లంగి లోకనాధం, దుంపల గోవిందరావు, యుగరాజు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.పలాస: జిల్లా అన్నదాత ప్రదాత బొడ్డేపల్లి రాజగోపాలరావు అని, ఆయన జిల్లా అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారని పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు, కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌ జితేశ్వరరావులు అన్నారు. ఆయన 32వ వర్థంతి సందర్భంగా కాశీబుగ్గ కెటి రోడ్డులోని రాజగోపాలరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు 1952 నుంచి 1984 వరకు ఆరుసార్లు శ్రీకాకుళం ఎంపీగా ఎన్నికయ్యారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కోత పూర్ణచంద్రరావు, సిపిఐ నాయకులు చాపర సుందరలాల్‌, లండ వెంకటరావు, చాపర వేణుగోపాల్‌, బమ్మిడి నాగేశ్వరరావు, దువ్వాడ హర్షకుమార్‌, బడ్డ నాగరాజు, మోహన్‌, పైల జవహార్‌, రవి, పైల శ్రీను, కొర్ల హేమారావు చౌదరి పాల్గొన్నారు. కోటబొమ్మాళి: మాజీ ఎంపీ, కీర్తిశేషులు బొడ్డేపల్లి రాజగోపాలరావు జిల్లాకు చేసిన సేవలు మరువలేనివని ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వర రావు అన్నారు. రాజగోపాలరావు వర్థంతి సందర్భంగా స్థానికంగా ఉన్న ఆయన విగ్రహానికి గురువారం పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ, పారిశ్రామికి అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. హిరమండలం వంశధార ప్రాజెక్టుకు అప్పటి సిఎం సంజీవయ్యతో శంకుస్థాపన చేసి జిల్లా రైతులకు సాగునీరు అందించారన్నారు. అలాగే ఆమదాల వలసలో సుగర్‌ ఫాక్టరీ స్థాపనలో ఆయన కృషి మరువలేనిదని అన్నారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ సంపతిరావు హేమసుందరరాజు, వైసిపి మండల పార్టీ అధ్యక్షులు నూక సత్యరాజు, పేడాడ వెంకటరావు, అన్నెపు రామారావు, మెట్ట సింహాచలం, పేడాడ వెంకటరావు, సింగుపురం వినోద్‌, వంశధార విద్యాసంస్థల కరస్పాండెంట్‌ చింతాడ అనిరుద్రుడు పాల్గొన్నారు. అలాగే హరిశ్చంద్రపురం కూడలి వద్ద ఉన్న రాజగోపాలరావు విగ్రహానికి సర్పంచ్‌ గురువెళ్లి కేశవరావు, బగాది దివాకర్‌లు పూలమాలలువేసి నివాళ్లర్పించారు.

 

➡️