రాష్ట్రంలో విద్యావ్యవస్థ నాశనం

రాష్ట్రంలో విద్యారంగాన్ని తాము

మాట్లాడుతున్న కూన రవికుమార్‌

  • ‘నాడు-నేడు’ పేరుతో పెద్దఎత్తున అవినీతి
  • విజన్‌ ఉన్న నాయకుడు చంద్రబాబు
  • టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రంలో విద్యారంగాన్ని తాము అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న సిఎం జగన్మోహనరెడ్డి విద్యావ్యవస్థనే నాశనం చేశారని, నాడు-నేడు పేరుతో పెద్దత్తెన అవినీతి జరిగిందని, రూ.వేల కోట్ల నిధులన్నీ తాడేపల్లికి దారిమళ్లించారని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ఆరోపించారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. విద్యారంగాన్ని దేశంలో ఎపి 29వ స్థానానికి దిగజార్చారన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని, బడులకు రంగులు వేస్తే గోడలు చదువు చెప్పుతాయా? అని ప్రశ్నించారు. గడచిన ఐదేళ్ల కాలంలో డిఎస్‌సి లేకుండా చేశారని, ఉన్న ఉపాధ్యాయులను ఐదేళ్లుగా వేధింపులకు గరి చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితిలో చదవులు ఎలా ముందుకు సాగతాయని ప్రశ్నించారు. ప్రమాణాలు దిగజారి పోతున్నా గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ గొప్పలు చెప్పు కుంటున్నారని విమర్శించారు. విద్యావ్యవస్థపై విజరీ ఉన్న నాయకుడు చంద్రబాబు అని కితాబిచ్చా రు. ప్రజలు జగన్‌ను ఒడించటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజల్లో వస్తున్న తిరుగుబాటును జగన్‌ ఊహించుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. సీట్లు వద్దని సొంత పార్టీ ఎమ్మెల్యేలే వెళ్లి పోతున్నారని, తోడపుట్టిన చెల్లేను నువ్వు వదిలిన బాణమని చెప్పిన జగన్‌కు ఇప్పుడు గునపమై గుచ్చుకుంటోందని వ్యాఖ్యానించారు. సొంత చెల్లెలని చూడకుండా సోషల్‌ మీడియాలో అసభ్యంగా రాయించే స్థితికి వైసిపి దిగజారి పోయిందని విమర్శించారు. ఎన్నికల తరువాత వైసిపి రాష్ట్రంలో కనుమరుగవుతుందన్నారు. మద్య నిషేధం అన్న హామీని గంగలో కలిపేశారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని అన్నా రు. అనేక డబుల్‌ ఎంట్రీలు, చనిపోయిన వారిపేర్లు లిస్టులో ఉన్నాయని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. సమావేశంలో నగర టిడిపి అధ్యక్షులు మాదారపు వెంకటేష్‌, జిల్లా పార్టీ ఉపాధ్య క్షులు బొనిగి భాస్కరరావు, ఎస్‌సి సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి.రమణ మాదిగ పాల్గొన్నారు.

 

➡️