వాడీవేడిగా సర్వసభ్య సమావేశం

మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి ముద్దాడ దమయంతి అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిసిసెల్‌ జోనల్‌ ఇన్‌ఛార్జి, జెడ్‌పిటిసి ధర్మాన కృష్ణచైతన్య పాల్గొని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా

సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణచైతన్య

ప్రజాశక్తి- పోలాకి

మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి ముద్దాడ దమయంతి అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిసిసెల్‌ జోనల్‌ ఇన్‌ఛార్జి, జెడ్‌పిటిసి ధర్మాన కృష్ణచైతన్య పాల్గొని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా అధికారులతో గడిచిన మూడు నెలలు చేసే పనులపై చర్చించారు. ఈ సందర్భంగా పంచాయతీశాఖ అధికారులపై ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. జడూరు, ఎస్‌ఎల్‌ పురం, బెలమర, గుప్పిడిపేట, బొద్దాం, ఉరజాం పంచాయతీల సర్పంచ్‌లు చేసిన పనులకు సంవత్సరాలు గడుస్తున్నా బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన పనులకు ఎంబుక్‌ నమోదు చేయడంలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అలాగే మత్యకారులకు ఉపాధిహామీ పథకం ద్వారా పనులు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ అధికారులు బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి ముద్దాడ బైరాగినాయుడు, వైసిపి మండల కన్వీనర్‌ కణితి కృష్ణారావు, ఎఎంసి చైర్మన్‌ దుంపల భాస్కరరావు, ఉప ఎంపిపి కె.తాతారావు, తహశీల్దార్‌ కె.శ్రీరాములు, ఎంపిడిఒ ఉషశ్రీ, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

 

➡️